గణపతి దేవాలయంలో వరంగల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

HNK: హనుమకొండ జిల్లాలోని గణపతి దేవాలయంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.