యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

యూరియా కోసం రైతుల ఎదురుచూపులు

GNTR: కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామంలో సుమారు 1000 ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ, కేవలం 220 బస్తాల యూరియా మాత్రమే రావడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ అధికారులు దీనిపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.