నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం

నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం

బీహార్ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్(RJD) ఇవాళ పాట్నాలో ముఖ్య సమావేశం నిర్వహించనుంది. ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ విధిగా పాట్నాకు చేరుకోవాలని తేజస్వీ ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి విస్తృతంగా సమీక్షించనున్నారు.