వామ్మో.. కాటేసిన పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాడు!

వామ్మో.. కాటేసిన పామును పట్టుకుని ఆస్పత్రికి వచ్చాడు!

యూపీలోని బిజ్నోర్‌లో ఓ వింత ఘటన జరిగింది. గౌరవ్ అనే వ్యక్తిని రోడ్డు పక్కన ఉన్న పాము కాటేసింది. అతను దాన్ని చంపకుండా పట్టుకుని ఆసుపత్రికి వెళ్లాడు. పాము విషపూరితమా కాదా అని డాక్టర్లకు చూపించి.. సరైన చికిత్స చేయాలని కోరాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు అతడికి చికిత్స అందించారు. పామును చూసి ఆసుపత్రిలోని సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు.