మదనపల్లి సబ్ కలెక్టర్‌గా శ్రీకాకుళం వాసి

SKLM: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్‌గా చల్లా కళ్యాణినిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందినవారు. 2023 బ్యాచ్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరారు. గతంలో కర్నూలులో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు.