నేడు సద్దుల బతుకమ్మ పండుగ.. సందడి వాతావరణం
SRCL: వేములవాడ పట్టణంలో శనివారం (నేడు) సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఉదయం రోడ్లన్నీ రద్దీ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పట్టణంలోని రెండో బైపాస్ ప్రాంతంలో మార్కెట్ ఉండడంతో తిరుక పుష్పాలను కొనేందుకు పట్టణవాసులు బారులు తీరారు. తెలంగాణలో ఎక్కడలేని విధంగా ఏడు రోజుల్లోనే వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు.