VIDEO: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం
RR: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చేవెళ్ల పోలీసు సిబ్బంది అన్నారు. ఇవాళ చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని రామన్నగూడలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని అన్నారు. కార్యక్రమంలో ఎస్సై, వార్డు కౌన్సిలర్ దయాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.