చేనేతపట్ల ప్రభుత్వం చిన్న చూపు తగదు: మాజీ జడ్పీటీసీ

చేనేతపట్ల ప్రభుత్వం చిన్న చూపు తగదు: మాజీ జడ్పీటీసీ

NLG: చేనేత కార్మికుల పట్ల, చేనేత సహకార సంఘాల పట్ల, చేనేత పరిశ్రమ పట్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూపడం తగదని చండూరు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం విమర్శించారు. బుధవారం ఆయన గట్టుప్పల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేత సహకార సంఘాలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు.