'భూములు కోల్పోతున్న రైతులు సర్వే చేయించుకోవాలి'
MNCL: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు సర్వే చేయించుకోవాలని మందమర్రి MRO సతీష్ కుమార్ గురువారం ప్రకటనలో తెలిపారు. క్యాతనపల్లి,తిమ్మాపూర్,గుండ ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రహదారి కోసం ఇంకా 23 మంది రైతులు తమ భూములను సర్వే చేయించాల్సి ఉందన్నారు. రైతులు MRO కార్యాలయంలో సర్వేయర్లను సంప్రదించి, తమ భూములు చూపించి సర్వే పూర్తి చేయచుకోవాలన్నారు.