అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు

అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు

అన్నమయ్య: దస్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో రేపు (సోమవారం) కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం వితరణ ఉంటుందని, భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించాలనీ కోరారు.