ఆస్తి పన్ను చెల్లించండి.. రాయితీ పొందండి
సూర్యాపేట పట్టణ ప్రజలు 2026-27 ఆర్థిక సంవత్సరపు ఆస్తి పన్నును ఏప్రిల్ 30లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, కమిషనర్ హన్మంతరెడ్డి ఈరోజు తెలిపారు. ఆన్‌లైన్ లేదా మున్సిపల్ కౌంటర్లలో పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు ముగిశాక రాయితీ వర్తించదని వారు అన్నారు.