శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి విమానం
TG: ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. విమానాశ్రయానికి తరచూ కార్గో విమానాలు వస్తుంటాయి. అయితే రుస్లన్‌గా పిలువబడే ఈ ఆంటనోవ్ ఏఎన్-124.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్గో విమానాల్లో రెండో స్థానంలో ఉంది. ఇది గరిష్టంగా 150 టన్నుల వరకు కార్గోను మోయగలదు.