పాము కాటుకు గురై వ్యక్తి మృతి
NRML: దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్‌లో మామిడి పోచయ్య అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యారు. గురువారం జరిగిన ఈ ఘటనలో రైతు కుడి కాలు పాదానికి పాము కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.