నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన గ్రంథాలయ ఛైర్మన్

KMR: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐకెపి వివోఎ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1000 క్యాలెండర్లను, డైరీలను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సంఘం ఏర్పాటు కోసం కీలకపాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, వ్యవస్థాపక అధ్యక్షుడు పఠాన్ గౌస్ ఖాన్, జిల్లా అధ్యక్షుడు శివరాం నాయక్ పాల్గొన్నారు.