రహదారి గుంతలమయం.. వాహనదారులకు నరకయాతన
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్‌హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.