'సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి'
NZB: ఈ నెల 22న టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు హాజరై సభ్యత్వం తీసుకోవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈయన ఉద్యోగులను గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో TNGOs సభ్యులు పాల్గొన్నారు.