రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

MNCL: బైక్ అదుపుతప్పి కింద పడటంతో చింతపురి అంజన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నెన్నెల నుంచి కర్జీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడి కాలికి బలమైన గాయం కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.