ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు అరెస్ట్
సిరిసిల్ల పట్టణంలో కత్తులు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు, సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. సుందరయ్య నగర్ సిక్కు వాడకు చెందిన బురహాని నర్సింగ్, రాజేష్ సింగ్, బురణి గోపాల్ సింగ్‌లు పెద్ద కత్తులు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.