VIDEO: కనిగిరి ప్రాంతంలో కూలిన భారీ వృక్షం

VIDEO: కనిగిరి ప్రాంతంలో కూలిన భారీ వృక్షం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కందుకూరు రహదారిలో సోమవారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వర్షం కారణంగా ఓ వృక్షం నేలకూలింది. దీంతో కనిగిరి, కందుకూరు మార్గాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు. దీంతో రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చెట్టు కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.