నెల్లూరు హైవేలపై మృత్యుఘోష!
నెల్లూరు జిల్లా హైవేలపై నిర్మాణ లోపాలు, సైన్ బోర్డుల లేమితో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ వద్ద పరిస్థితి దారుణం. అధికారులు గుర్తించినా చర్యలు శూన్యం. 2025లో హైవేలపైనే 266 మంది మృతి చెందడం ఆందోళనకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలి.