విద్యార్థినికి ల్యాప్ టాప్ అందజేసిన హుస్సేన్ నాయక్
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని బొమ్మెనబోయిన మహేశ్వరికి రూ. 35 వేల విలువగల ల్యాప్ టాప్‌ను గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అందజేశారు. నిరుపేదలు చదువులో రాణించాలనే సంకల్పంతో తాను నిత్యం అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.