'246 మంది రైతులకు న్యాయం చేశా'

'246 మంది రైతులకు న్యాయం చేశా'

AKP: మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో 246 మంది రైతులకు చెందిన 186 ఎకరాల 14 సెంట్లు భూముల సమస్యను పరిష్కరించానని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం పేర్కొన్నారు. ఏపీఐఐసీ రెవెన్యూ వెబ్ ల్యాండ్ రికార్డులలో తప్పులుగా నమోదు జరిగిందన్నారు. 2012 సంవత్సరం నుంచి రైతులు అనేక కష్టాలు పడ్డారన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో న్యాయం జరిగిందన్నారు.