ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ను కలిసిన నాయకులు

VZM: ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గురువారం విజయనగరం క్యాంప్ ఆఫీస్‌లో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డి.వి.జి శంకరరావుని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న నకిలీ కులదృవ పత్రాలు, ఇతర దీర్ఘకాల సమస్యలు, షెడ్యూల్ ప్రాంత భూములపై హక్కులు గిరిజనులకే దక్కేలా చూడాలని JAC సంఘ నాయకులు ఛైర్మన్‌తో చర్చించారు.