జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

సూర్యాపేట జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మూడు రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 10 నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది.