మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

NGKL: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నామని సోమవారం ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి ఆయన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.