చీఫ్ ఇంజనీర్ అదృశ్యం.. ఆత్మహత్య లేఖ లభ్యం

చీఫ్ ఇంజనీర్ అదృశ్యం.. ఆత్మహత్య లేఖ లభ్యం

VSP: నగరంలోని ఒక ప్రముఖ కంపెనీలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ బుధవారం ఉదయం నుంచి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. ​వెళ్లే ముందు 'తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు' రాసిన లేఖ లభించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.