మావోయిస్టులు బంద్ పిలుపు.. అప్రమత్తం

మావోయిస్టులు బంద్ పిలుపు.. అప్రమత్తం

ASR: మారేడుమిల్లి ఎన్ కౌంటర్లకు నిరసనగా ఆదివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని రాజవొమ్మంగి సీఐ గౌరీశంకర్ హెచ్చరించారు. రాజవొమ్మంగి, జడ్డంగి ప్రాంతాల్లో ముఖ్య నాయకులకు ఇప్పటికే సమాచారం అందజేశామన్నారు. మారుమూల గ్రామాలకు వెళ్ళరాదని సూచించామని తెలిపారు.