నీటిని సంరక్షిద్దాం... మాజీ ఎమ్మెల్యే

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు శుక్రవారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా స్పందించారు. ఈ సందర్భంగా నీటిని కాపాడుకోవాలని ప్రజలకు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. నీరు మనుషులకు ప్రాణాధారమని, పరిమితంగా ఉన్న నీటి వనరులను సంరక్షించాలని ఆయన కోరారు.