శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి సీజ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి సీజ్

TG: థాయ్ ఎయిర్‌వేస్‌ విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆమె లగేజీలో దాచి ఉంచిన 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. ఆమెను అదుపులోకి తీసుకొని, గంజాయిని సీజ్ చేశారు. సాధారణ గంజాయితో పోలిస్తే దీని మత్తు తీవ్రత, అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.