3 నెలల్లో 28 మంది మృతి.. ఊరు ఖాళీ చేసిన గ్రామస్తులు
KNR: జమ్మికుంట(M) గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా 28 మంది చనిపోవడం కలకలం రేపింది. దీంతో గ్రామానికి ఏదో కీడు సోకిందని ఓ పురోహితుడి సూచన మేరకు గ్రామస్థులంతా ఊరు ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి పొలాల్లో 'కీడు వంటలు' వండుకోవాలని ఇళ్లకు తాళాలు వేసి మరి బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన పీడ విరగడవుతుందని వారు విశ్వసిస్తున్నారు.