రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి

రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి

నంద్యాల జిల్లా బైర్లూటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.