కాణిపాకంలో భక్తుల రద్దీ
CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవు దినం కావడంతో క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టినట్టు ఆలయ ఈవో పెంచుల కిశోర్ వివరించారు.