VIDEO: అండర్-17 వాలీబాల్‌లో జిల్లాకు తృతీయ బహుమతి

VIDEO: అండర్-17 వాలీబాల్‌లో జిల్లాకు తృతీయ బహుమతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అండర్-17 వాలీబాల్ టోర్నమెంట్ జడ్చర్లలో జరిగింది. పోటీల్లో వనపర్తి జిల్లా జట్టు తృతీయ బహుమతిని గెలుచుకుంది. ఈ మేరకు ఎసీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొలెమోని కుమార్, కోచ్ శేఖర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఇవాళ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందించి, క్రీడల్లో మరింత ప్రతిభ చాటాలని సూచించారు.