కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్
ASF: కాగజ్‌నగర్ మండలం కోయవాగు సర్పంచ్ చింతపురి లక్ష్మీ, మాజీ ఉపసర్పంచ్ అదే రాజు, మాజీ కోఆప్షన్ సభ్యుడు చొటుభాయ్, తదితరులు ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని విఠల్ అన్నారు. సిర్పూర్-నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు.