కోనసీమలో దారుణం.. బాలికపై అత్యాచారం
AP: కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఐ.పోలవరం మండల పరిధిలో ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.