VIDEO: 'పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి'

ప్రకాశం: ఈనెల 27న జరిగే వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని DSP నాగరాజు అన్నారు. శనివారం కంభంలోని మత పెద్దలతో స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.