రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం

మేడ్చల్: పోచారం మున్సిపాలిటీలోని జోడిమెట్ల నుంచి వెంకటాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో కల్వర్టుపై ఏర్పడ్డ గుంత ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంత చుట్టు తాత్కాలికంగా ఇనుప పైపులతో కంచె ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని, రాత్రి వేళలో కల్వర్టు వద్దకు చేరుకోగానే భయాందోళనకు గురవుతున్నట్లు వాహనదారులు తెలిపారు.