మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

VSP: విదేశీ ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాలపై విశాఖ పోలీసులు దాడులు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. కాంబోడియా, మయన్మార్ వంటి దేశాలకు యువతను అక్రమంగా పంపిస్తూ మోసాలు చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే మోసపోయిన 85 మందిని వెనక్కి రప్పించారు. అనధికారిక ఏజెంట్లను నమ్మవద్దని, వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని సీపీ శంకబ్రత బాగ్చి సూచించారు.