'రింగ్ రోడ్డు పేరట సర్వే ఆపాలని ఫిర్యాదు'

AKP: రింగ్ రోడ్డు పేరుతో సర్వేను రైతులు అడ్డుకొని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. రామన్నపాలెం గ్రామ రైతులతో సంప్రదింపులు లేకుండా సర్వే చేయడంతో ఆందోళన చెందుతున్నారు. 150 ఏళ్ల నుంచి ఆ భూములను సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. రింగ్ రోడ్డు పేరుతో సాగుచేసిన భూములను సర్వే చేయడం సరికాదన్నారు. భూ సర్వే నిలుపుదల చేయాలని పలువురు రైతులు కోరారు.