'డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి'
BDK: పాల్వంచ మండలం TGSWR జూనియర్ కళాశాలలో చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీస్పీ సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ అన్వేష్ పాల్గొన్నారు.