దొణగంగమ్మ జాతరలో వృషభం వీరంగం

దొణగంగమ్మ జాతరలో వృషభం వీరంగం

ATP: రాయదుర్గంలోని టి. వీరాపురంలో జరిగిన దొణగంగమ్మ జాతరలో ఓ వృషభం వీరంగం సృష్టించింది. శ్రావణమాసం చివరి సోమవారం జరిగే ఈ జాతరలో వివిధ గ్రామాల రైతులు మొక్కులు తీర్చుకునేందుకు తమ కాడెద్దులతో ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఓ రైతుకు చెందిన వృషభం జనాలను చూసి బెదిరిపోయింది. రైతు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాలేదు.