నేడు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా

ADB: ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ తెలిపారు. రైతులందరికీ కటాఫ్ లేకుండా రైతు భరోసా వెంటనే ఇవ్వాలన్నారు.