'కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి'

కృష్ణా: సముద్ర తీరం వెంబడి కొత్త వ్యక్తులు, కొత్త బోట్ల సంచారంపై మత్స్యకారులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. బుధవారం ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు సముద్ర తీరం వెంబడి మెరైన్ పోలీస్‌తో కలిసి కోడూరు పోలీస్ గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకాయతిప్ప గ్రామంలో ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.