మానవత్వం ఇంకా బతికే ఉందా..!
NRPT: చెట్టు పైనుంచి గెంతుతూ కరెంట్ షాక్ తగిలి కింద పడ్డ వానరానికి సిపిఆర్ చికిత్స చేసి ప్రాణాలు నిలిపిన సంఘటన పోలీస్ స్టేషన్ తాహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. చెట్టు పైనుంచి కిందపడి స్పృహ లేకుండా పడిఉన్న వానరాన్ని అటుగా వెళ్తున్న మున్సిపల్ కార్మికులు కరాటే మాస్టర్ సలీం గమనించి వెంటనే దానికి సపరియాలు చేసి సిపిఆర్ పద్ధతి చేయడంతో ఆ కోతి బతికింది.