జిల్లాలో 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

ప్రకాశం: జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుంచి రూ. 3.99 కోట్ల విలువ గల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ఒంగోలులో జేసి మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ. 3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు.