ట్రాక్టర్ నడిపిన MLA సోమిరెడ్డి

NLR: వెంకటాచలంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ విజయోత్సవ సభ నిర్వహించారు. దాదాపు 250 ట్రాక్టర్లతో రైతులు, టీడీపీ నాయకులు ఇసుక యార్డు నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ చేపట్టారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాసేపు ట్రాక్టర్ నడిపారు. రైతు సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారని కొనియాడుతూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.