కోర్టు భవన నిర్మాణానికి జడ్జి శంకుస్థాపన

KMM: మధిర పట్టణంలో రూ. 24 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు, ఖమ్మం జిల్లా జడ్జి జీ.రాజగోపాల్ గురువారం శంకుస్థాపన చేశారు. నూతన కోర్టు భవనం ఏర్పాటు ద్వారా ప్రజలకు త్వరిత న్యాయం అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎన్ ప్రశాంతి, జడ్జి వేముల దీప్తి, టౌన్ సీఐ రమేష్ ఉన్నారు.