తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహణ

తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహణ

ఖమ్మం నగరంలో శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌ను జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సందర్శించి తపాల శాఖ స్టాంపులను ఆసక్తిగా తిలకించారు. మొత్తం 108 ప్రేముల్లో 3,456 జాతీయ, అంతర్జాతీయ స్టాంపులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.