పది ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్

పది ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్

సూర్యాపేట: పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం హాస్టల్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిరోజూ రివిజన్ చేయించాలని సూచించారు.