BREAKING: అనేక చోట్ల పెట్రోల్ బంకులు బంద్
HYD: మహానగరంలో అనేకచోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. ఉప్పల్, మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్ లాంటి చోట్ల 'నో పెట్రోల్' బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు CNG గ్యాస్ కోసం నగరంలో అనేక చోట్ల ఆటోలు, కార్లు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. తార్నాక ఉస్మానియా పెట్రోల్ బంక్ వద్ద ఇదే పరిస్థితి ఉందని అక్కడి విద్యార్థులు తెలిపారు.